23 July, 2026 | 12:21 PM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

29-06-2024 02:40 AM
  • ప్రజాపాలన కేంద్రాలను ఉపయోగించుకోవాలి
  • వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

కొడంగల్/ వికారాబాద్, జూన్ 28 : కొడంగల్  నియోజకవర్గ అభివృద్ది పను ల్లో వేగం పెంచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంజూరై న పనులకు టెండర్ల ప్రక్రియను వేగవం తం చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణకు సంబంధించి ఆర్ అండ్ బి, పంచాయతీ శాఖల ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

వివిధ కాలేజీల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని, భూసేకరణ విషయంలో ఏదైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అటవీ భూముల్లో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొడంగల్ పట్టణ కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించి అక్కడి పరిస్థితులను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. 

జిల్లాలో ప్రజాపాలన కేంద్రాలు.. 

ప్రజా పాలన దరఖాస్తుదారులు  ఏవైనా సవరణలు ఉంటే ప్రజాపాలన కేంద్రంలో సరి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే ప్రజా పాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి మండల కేంద్రం, మున్సిపల్ కేంద్రాల్లో ప్రజా పాలన కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసిల్దార్ విజయ్‌కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాలొన్నారు.