23 July, 2026 | 10:52 AM

ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. CJP ఫుల్ ఆన్ ఫైర్

23-07-2026 10:14 AM

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు(Restrictions Continue) కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. జంతర్‌మంతర్‌ దగ్గర సీజేపీ(Cockroach Janta Partyprotestఆందోళనలతో భద్రత కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీలో పాఠశాలలు మూసి వేసి.. ఆన్ లైన్ తరగతులు చెబుతున్నారు. పార్లమెంట్, ప్రధాని మోదీ నివాసం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 16 మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు DMRC ప్రకటించారు.

మెట్రో స్టేషన్లు మూసివేత(Delhi Metro Stations) సామాన్యులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు స్టేషన్లలో ఇంటర్ చేంజ్ సౌకర్యం కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని డీఎంఆర్ సీ సూచించింది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఆందోళన ఆగదని CJP తేల్చిచెప్పింది. దేశరాజదానిలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో(Internet Services Shut Down) విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే రోడ్లు దిగ్బంధం చేశారు. భారీగా CRPF, RAF, ప్రత్యేక పోలీస్‌ బలగాలు మోహరించారు.