23 July, 2026 | 11:32 AM

ఆర్టీఏ ఉద్యోగుల నిరసన

29-06-2024 02:42 AM
  • జేటీసీపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేష్‌పై ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ దాడిని నిరసిస్తూ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు, ఉద్యోగులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దాడులు చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ సంఘీభావం తెలిపారు.

జేటీసీపై దాడి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరసనలో బాధితుడు జేటీసీ సి.రమేష్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియే షన్ అధ్యక్షుడు పి.రవీందర్ కుమార్, గ్రూప్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ గౌడ్, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్, వివిధ సంఘాల నాయకులు కృష్ణ యాదవ్, అరుణేందర్ ప్రసాద్, డి.ప్రదీప్ రామకృష్ణ, ఎంజులా రెడ్డి, ఎన్.శ్రీనివాస్, జి.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.