28 July, 2026 | 2:51 AM

గ్రామస్థాయికి ఉద్యమస్ఫూర్తి

28-07-2026 01:39 AM
  1. పంజాబ్ పేపర్ లీక్‌పైనా పోరాడతాం
  2. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే

న్యూఢిల్లీ, జూలై ౨౮: తమ ఉద్యమానికి తాత్కాలిక విరామమే ఇచ్చామని, విద్యార్థుల భవిత కోసం మున్ముందు మరిన్ని పోరాటాలు చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తిని గ్రామస్థాయి వరకు విస్తరించడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని తేల్చిచెప్పారు. పంజాబ్‌లో నీట్ పేపర్ లీకేజీ అంశంపైనా పోరాడతామని వివరించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పార్టీ రాజకీయ కార్యాచరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఏ ఒక్క విద్యార్థి భవిష్య త్తు నాశనం కాకూడదనేదే తమ పార్టీ స్పష్టమైన సిద్ధాంతమని పునరుద్ఘాటించారు. దే శంలో విద్యావ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మున్ముందు తమ కార్యాచరణను మరింత స్పష్టంగా ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం తాము విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ కోసం పోరాడుతున్నామని వెల్లడించారు.