21-01-2026 12:00:00 AM
సూర్యాపేట, జనవరి 20 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరమని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 65 మంది వివిధ కారణాలతో అనారోగ్యాల పాలు కాగా వారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన రూ.25.39 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు సకాలంలో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి చెక్కుల మంజూరు కి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, ఛివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, పిసిసి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వేములకొండ పద్మ, గుణగంటి వంశీధర్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.