16 August, 2026 | 3:00 PM

అమీన్‌పూర్ పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్

24-05-2024 02:03 AM

పటాన్‌చెరు, మే 23 (విజయక్రాంతి) : అమీన్‌పూర్ పెద్దచెరువును జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం పరిశీలించారు. అమీన్‌పూర్ పెద్దచెరువు అలుగు, తూము కాలువలు మూసేయడంతో ఎఫ్‌టీఎల్ పరిధి పెరిగి శ్రీవాణీనగర్ కాలనీతో పాటు ఐదువేల పాట్లు నీటిలో మునిగిపోతున్నాయని బాధితులు ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి అమీన్‌పూర్ పెద్దచెరువు ఏఎఫ్‌టీ పరిధిని పరిశీలించారు.

ముంపు బాధితులు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించగా అలుగు, కాలువలను పునఃరుద్దరించి తూము కాలువలను వదలాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాగా అమీన్‌పూర్ పెద్దచెరువు బదులు బందంకొమ్ము చెరువును కలెక్టర్‌కు చూపించి సమ స్యను పక్కదారి పట్టించారని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటన లో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఆయా కాలనీల ప్రజలు ఉన్నారు.