అదే నీవు అదే నేను.. గేటెడ్ కమ్యూనిటీ కథ!
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ.. “ఈ కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది.
ప్రస్తుత సమాజంలో భార్యలు భర్త ల్ని చంపుతున్న నేరాల తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందనేది మా సినిమాలో చూసిస్తాం. థియేటర్‌లో మా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఉలిక్కిపడటం ఖాయం. నిర్మాత గోవిందు మాట్లాడుతూ.. “ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: నిమ్మల జయపాల్ రెడ్డి; సంగీతం: కనిష్క; పాటలు: పూర్ణాచారి; మాటలు: వై అమ్మిరాజు; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్ ఆర్ట్: నార్ని శ్రీనివాస్.






