వదలాను ఎవరూ ట్రోల్ చేయలేరు!
ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’తో సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు విలక్షణ నటుడు జగపతిబాబు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. అకెళ్ల వీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో గురువారం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాను ఎవరూ ట్రోల్ చేయరు. అంత అవకాశం, సమయం ఎవరికీ లేవు. అందువల్ల మేం సేఫ్. కొన్ని చిత్రాలను టార్గెట్ చేసి చేసే విమర్శలు చూస్తుంటే మనమే బాధపడుతున్నాం. అలాంటి ఆలోచనలు వదిలేసి, పాజిటివ్‌గా ఉందాం” అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. “అన్నిటికంటే ముందు మనం సినిమాను నమ్మి తీయాలి” అని తెలిపారు. ఈ ఈవెంట్‌లో మిగతా టీమ్ కూడా మాట్లాడారు.






