2 July, 2026 | 2:13 AM

తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ లేదు

02-07-2026 01:10 AM

ప్రజలు బీజేపీ ముక్త్ భారత్‌ను కోరుకుంటున్నారు

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ లేదని, ఆ పార్టీ అవసరాలు కూడా రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్.. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పరిస్థితులు, కుల సమీకరణలు, ఉద్యమంపై నితిన్ నబిన్‌కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. అయోధ్య రామమందిరం, కాళేశ్వరం స్కామ్‌లపై నబిన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు పేరిట నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మత వైషమ్యాలకు తావులేదని, మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదన్నారు. సర్ కార్యక్రమం ఓట్ల తొలగింపు కార్యక్రమంలా మారిందన్నారు.

బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నాయకులు తాత్కాలిక గోల్స్ మాత్రమే రీచ్ అవుతారని, ఎన్ని పార్టీలు కలసి పోటీ చేసినా కాంగ్రెస్‌ను ఢీకొట్టలేవని విమర్శించారు. సోనియాగాంధీ వల్ల, వేలాది మంది ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే.. ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని విమర్శించారు.