ప్లే ఆఫ్స్‌కు చేరువలో హైదరాబాద్
తెలంగాణ టీ20 లీగ్
హైదరాబాద్, జూలై 1 : టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ కు చేరువైంది. తాజాగా వరంగల్ వారియర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిం ది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ అ మన్‌రావు (45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషికేత్ సిసోదియా (38), శౌనక్ కులకర్ణి (24), హర్షిత్ చౌదరి (22), ధీరజ్ (18) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అజ య్ దేవ్‌గౌడ్ (3/27) ఆకట్టుకున్నాడు.
తర్వా త ఈ టార్గెట్‌ను హైదరాబాద్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కె ప్టెన్, ఓపెనర్ అభిరథ్ రెడ్డి సెంచరీతో చెలరేగాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గడుగు గణేశ్ (50) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన వరంగల్కు ఇది నాలుగో ఓటమి. అభిరథ్ హఫ్ సెంచరీని (28 బంతుల్లో) పూర్తి చేసుకున్నా డు. సల్మాన్ వేసిన 16 ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. అటు వరంగల్‌కు ఇది నాలుగో ఓటమి.






