calender_icon.png 13 February, 2026 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై భారీ ర్యాలీ, ప్రదర్శన

13-02-2026 12:00:00 AM

నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలి.

ములకలపల్లి, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, టి యు సి ఐ జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె సందర్భంగా మండల కేంద్రములోని సిఐటియు, ఏఐటీయూసీ, టియుసిఐ కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో భారీ ర్యాలీ,ప్రదర్శన నిర్వహించారు. సమ్మె కు రైతు,వ్యవసాయ,కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

అనంతరం ఇంచార్జీ తాహశీల్ధార్ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళుగా మారాయని భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో కార్మికులు మూలస్తంభం లాంటి వారని కార్మికులు ఏళ్ళుగా పోరాడి తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకు వస్తున్నారని ఆరోపించారు.

నాలుగు లేబర్ కోడ్ ల కారణంగా కార్మికులు శ్రమ దోపిడీకి గురై ఒత్తిడి కారణంగా  భవిష్యత్తులో అనేక అనారోగ్యా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. దేశ రైతాంగానికి మరణ శాసనంలా ఉన్న నూతన విద్యుత్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కుంజా కృష్ణ,ఏఐకెఎమ్‌ఎస్ జిల్లా కార్యదర్శి కోరం వెంకటేశ్వర్లు (గణేష్), సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు దుబ్బ ధనలక్ష్మి,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు,టియుసిఐ జిల్లా నాయకులు నూప భాస్కర్, కల్లూరి కిషోర్,సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు,

ఏఐటీయూసీ నాయకులు యూసుఫ్, ఎస్కే జబ్బార్, నాగరాజు,పివైఎల్ నాయకులు కోర్సా రామకృష్ణ,పద్మ,సిఐటియు నాయకులు గంటా శ్రీనివాసరావు,బుగ్గా వెంకట నర్సమ్మ, కీసరి జయ,ఓరుగంటి శ్రీను, పుష్ప తదితరులు పాల్గొన్నారు.