calender_icon.png 6 December, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి ఐక్యతనే పార్టీకి బలం

06-12-2025 12:35:47 AM

ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి

 మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 5 : ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి అభివృద్ధి వైపు కలిసి పని చేద్దామని ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం.సంజీవ్ ముదిరాజ్ ప్రమాణ స్వీకార మహోత్సవం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు నూతన అధ్యక్షుడిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త నాయకుల ఉత్సాహం కలిసినప్పుడే ఏ పార్టీ అయినా వృద్ధి సాధిస్తుందని,   మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ విస్తరణకు ఇదే సరైన సమయమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.   జిల్లాలో ఉన్న ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో అడుగులు వేయాలంటే సమష్టి కృషి అవసరమని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చాకే పార్టీ బలపడ్డ తీరును  ఈ సందర్భంగా గుర్తకు చేశారు.  ఈ కార్యక్రమం ప్రారంభంలో  నూతన డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ డిసిసి అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి,  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు డా. చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్,  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జి గోనెల శ్రీనివాసులు, టీపిసిసి ప్రతినిధి జహీర్ అక్తర్, సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్.పీ. వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయిబాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, గోపాల్ యాదవ్, అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హన్వాడ మండల అధ్యక్షుడు వి.మహేందర్, చెన్నయ్య , హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నవనీత, శారద, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డి, ఫయాజ్, తాహేర్, అనుప ఆంజనేయులు, యాదిరెడ్డి, రఘు దాసరి, జె.వెంకటయ్య, జేసిఆర్, అబ్దుల్ హక్, మోయీజ్ తదితరులు పాల్గొన్నారు.