calender_icon.png 6 December, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌కే పరిమితం చేయడం దుర్మార్గం

06-12-2025 12:34:30 AM

  1. పోలీసు ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారింది
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : ప్రైవేటు ఆస్పత్రులకు పెండింగ్ బ కాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భ ద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆస్పత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. పోలీసుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య భద్ర త కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం.. వారికి సేవలు అందించడంలో మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.

నిత్యం ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యాన్ని దూరం చేసి, నిమ్స్ ఆస్పత్రికే పరిమితం చేయడం శోచనీయమని తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల, సకాలంలో వైద్యం అందక పోలీసు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ తేడాది అక్టోబర్‌లో గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సు జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవ ర్’లో ఓ ప్రముఖ ప్రైవేటు దవాఖానకు తరలించినప్పటికీ.. పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 

రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు ఆ రోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని, ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దిక్కుమాలిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ఆపత్కాలంలో ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రారంభిం చిన ఆరోగ్య భద్ర త పథకం లక్ష్యాన్ని నీరుగార్చుతుండటం హే యమైన చర్య అని, ఆంక్షలు, అరెస్టులతో నిత్యం పోలీసుల పహారా నడుమ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి... ఇప్పుడు ఆ పోలీసుల జీవితాలతో చలగాటమాడటం దుర్మా ర్గమని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ఏక్ పోలీస్ వ్యవస్థ తెస్తామని ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అధికారం లోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని తెలిపారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరో గ్య భద్రత బకాయిలన్నీ చెల్లించి, నిమ్స్‌తో పాటు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, టీఏలు వెంటనే చెల్లించాలని, స్టేషన్ అలవెన్సులు నెలనెలా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.