24 May, 2026 | 12:27 AM

రాష్ట్రంలో భానుడు భగభగ

24-05-2026 12:00 AM
  1. ఏడు జిల్లాల్లో 46 డిగ్రీలు
  2.   28 వరకు డగాల్పులు, అక్కడక్కడ వర్షాలు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో భారీగా పెరుగుతున్నాయి. శ నివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 46 డిగ్రీ ల ఉష్ణోగ్రతలు, తొమ్మిది జిల్లాల్లో 45.1 -45.9 డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీలు, జగిత్యాల్‌లో 46.3, కుమ్రం భీం ఆసిఫాబాద్, సూర్యాపేటలో 46.2 చొప్పున, ఖమ్మం, మంచిర్యాలలో 46.1 డిగ్రీలు, ములుగులో 46.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెద్దపల్లిలో 45.9 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండలో 45.7 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్‌లో 45. 5, కరీంనగర్, మహబూబాబాద్‌లో 45.3, వరంగల్‌లో 45.2, సిద్ధిపేటలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లో 39.8-44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 26.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 28 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.