24 May, 2026 | 1:26 AM

మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలి

24-05-2026 12:26 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలి
  2. రాష్ట్ర మిల్లర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రైస్ మిల్లర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పా డి గణపతిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, రైస్ మిల్లర్లు అనేక సమస్యల తో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లో శనివారం  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వ విధానాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యం అవ్వడంతో పాటు నిల్వ సమస్యలు, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్‌లో రికార్డుస్థాయిలో 90 లక్షల టన్నుల వరి కొనుగోలు ల క్ష్యాన్ని పెట్టుకుందని, కానీ రైస్ మిల్లర్లకు సదుపాయాలు కల్పించడంలో విఫలమైందన్నారు.

రైతుల నుంచి వరిధాన్యం కొనుగో లులో వేగం పెరగడంతో, మిల్లింగ్ సామర్థ్యంపై కూడా ఒత్తిడి పెరిగిందన్నారు. మరో వైపు, వడ్ల కొనుగోలు ఆలస్యం జరిగితే రైతులతో పాటు మిల్లర్లపై కూడా ప్రభావం పడు తుందని,సీఎం రేవంత్‌రెడ్డితో పాటు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు అంతా మిల్లర్ల సమస్యలు పరిష్కరించే దశగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీతో పా టు వాటిపై విధించిన వడ్డీలను మాఫీ చేయాలని,ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, మిల్లర్లకు సబ్సిడీలు అందించాలన్నారు. సీఎంఆర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.