త్యాగయ్యకు సంగీత నీరాజనం
వైభవంగా సద్గురు త్యాగరాజ జయంతి ఉత్సవాలు
భక్తిభావంలో మునిగితేలిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం
హైదరాబాద్ (బాగ్‌లింగంపల్లి), మే 4(విజయక్రాంతి): నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా 259వ సద్గురు త్యాగరాజ జయంతి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నాగసుధ చల్లా, స్రవంతి పెద్దిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
నాగసుధ చల్లా 2016 లో మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌లో త్యాగరాజ జయంతి ఉత్సవాలను ప్రారంభిం చి, అప్పటి నుంచి ప్రతి ఏడాది నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక కళాకారులు, ముఖ్యంగా చిన్నారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికను అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 259వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ వేడుక సంగీ త రసికులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ ఎం. వి. కమల రమణి తన శిష్యబృందంతో కలిసి త్యాగరాజ పంచరత్న కృతులను భక్తిశ్రద్ధలతో ఆలపించారు.
అలాగే త్యాగరాజ స్వామి రచించిన అనేక ప్రసిద్ధ కీర్తనలను వివిధ కళాకారులు ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వాయి ద్య సహకారంగా వయల్పి ఫణిబాల, మృదంగంపై సుసర్ల శర్మ అందించిన నైపుణ్యం సంగీత కచేరీకి మరింత మా ధుర్యాన్ని జోడించింది. కార్యక్రమానికి సంగీత రసికులు, కళాకారులు, పలువురు ప్రముఖులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. అనంతరం నిర్వాహకులు సంగీత విద్వాంసులు, వాద్య సహకారం అందించిన కళాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.






