17 July, 2026 | 1:45 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

అమ్మాయి హత్య నేపథ్యంలో ది సస్పెక్ట్

13-03-2025 01:13 AM

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్ ప్రసా ద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ది సస్పెక్ట్’. ఈ చిత్రాన్ని టెం పుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ ఈ చి  త్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 21న ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో విడుదల కానుంది.

ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ.. ‘ది సస్పెక్ట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.  దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది” అన్నారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందినవీ ఉన్నాయి. ది స స్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి” అన్నారు. నిర్మాత కిర ణ్ కుమార్ మాట్లాడుతూ..- “సినిమా రంగంలోకి రావాలనేది నా కల.

అది ఈ సినిమాతో నెరవేరింది. నా స్నేహితుడు వీఎన్ ఆదిత్య మా మూవీ ఈవెంట్‌కు రావడం ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది” అని తెలిపారు. ని ర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. “మూవీ ట్రైలర్ చాలా బా గుంది.

ఈ సిని మా కిరణ్ గారికి మంచి పేరు డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా” అన్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “మేము ఈ సినిమాను అం దరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించాం. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది” అన్నారు.