17 July, 2026 | 1:41 PM

Breaking News

కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •  

కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన

17-07-2026 01:41 PM

ప్రాజెక్టులను నింపి రైతులకు సాగునీరు అందించాలి 

గజ్వేల్, జులై17: కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ నుండి రిజర్వాయర్లలోకి నీటిని నింపి రైతులకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మాజీ రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రవీందర్, గజ్వేల్ మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మాజీఎంపీపీలు, జడ్పిటిసిలు,  మండల పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు పంట సాగు చేయడానికి భయపడుతున్నారని, ఇప్పటికే వేసిన పంటలను పలువురు రైతులు మళ్లీ దున్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మేడిగడ్డ వద్ద కన్నేపల్లి పంప్ హౌస్ నుండి నీటిని మిగతా రిజర్వాయర్లకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.