తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మెంటన్ ఛాంపియన్‌షిప్ విజయవంతం కావాలి
ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, జూన్ 19 : తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాట్మెంటన్ 2026 ఛాంపియన్ షిప్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో క్లియర్ స్పోరట్స్ ఆరేనాలో నిర్వహిస్తున్న యూనిక్స్ సన్రైస్ 12వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను క్రీడలు పెంపొందిస్తాయని తెలిపారు.
రాష్ట్రం నలుమూలల నుండి ఈ క్రీడా పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు మిర్యాలగూడ పట్టణం ఆతిథ్యం ఇవ్వడం ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని యువత క్రీడలను కెరీర్ గా ఎంచుకునేలా అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులు క్రీడాభిమానులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






