బొగ్గు రవాణా ఏర్పాట్ల పరిశీలిన
కొత్తగూడెం, జూన్ 19, (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (ఆర్ సి హెచ్ పి) మరియు రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శ్రీ బి. వెంకన్న, ఐ ఆర్ టి ఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) శుక్రవారం రోజున సందర్శించారు. అందులో భాగంగా ఆర్సిహెచ్పి, రుద్రంపూర్ రైల్వే సైడింగ్లలోని బొగ్గు లోడింగ్, రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బొగ్గు రవాణా ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు. అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. వెంకన్న మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో సానుకూల ఆలోచనలను పెంపొందించడంతో పాటు ప్రశాంతమైన కార్యాలయ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, మనోధైర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బి. వెంకన్న, ఐఆర్టిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్), కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజుతో పాటు ఎస్.ఓ టు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స గారు, ఇన్చార్జ్ (హెచ్ ఓ డి) సివిల్ కె. రాజారాం, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తౌర్య, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సౌజన్య, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.






