28 May, 2026 | 2:31 AM

ఆ రహస్యాలను చెప్పే త్రికాల

28-05-2026 01:21 AM

టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్.. ‘ఆర్య2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుం ది. ఇప్పుడు ‘త్రికాల’ చిత్రంలో మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను పలుకరించనుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ చిత్రమే ‘త్రికా ల’. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ.. ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. ఈ చిత్రానికి  సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్; డీవోపీ: పవన్ చెన్న.