10 July, 2026 | 1:00 AM

జననాయగన్@ 2 గంటల 43 నిమిషాలు!

11-07-2026 12:00 AM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మమితా బైజు, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా అన్ని అడ్డంకులు తొలగిపోయి, సెన్సార్ పూర్తి చేసుకుందీ చిత్రం.

ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం 183 నిమిషాల (2 గంటల 43 నిమిషాలు) రన్‌టైమ్‌తో థియేటర్లలో విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ యార్క్ సినిమాస్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 24 నుంచి కెనడాలో.. అంత కంటే ఒక రోజు ముందే, అంటే జూలై 23నే భారతదేశంలో ఈ సినిమా విడుదల కానున్నట్టు సమాచారం.