20 June, 2026 | 2:36 AM

మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే..

20-06-2026 12:23 AM

సూర్య హీరోగా నటిస్తున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాగ వంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తునన ఈ సినిమాలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుంచి తొలిగీతంగా ‘నేనో బటర్‌ఫ్లు’ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

కథానాయకుడిని ఉద్దేశించి, నాయిక పాడుకునే ఈ పాట సంగీత ప్రియుల హృదయాలను దోచుకుంటోంది. ‘రఫ్ అయిన నువ్వు.. టఫ్ అయిన నేను.. మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే..’ అంటూ ప్రేమలోని అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబింపజేసేలా ఉందీ గీతం. జీవీ ప్రకాశ్ స్వరపర్చిన ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సుబ్లాషిని పాడారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రానికి నిమిష్ రవి డీవోపీ కాగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.