4 May, 2026 | 5:21 AM

అత్యంత విషాదకరం

01-06-2024 12:05 AM

జమ్ము కాశ్మీర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరవై రెండు మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన అత్యంత విషాదకరం. ఇంకా 57 మంది గాయపడ్డారని తెలు స్తున్నది. అంటే, బస్సులో 79 మంది ప్రయాణికులు వున్నట్టున్నా రు. అసలు బస్సు కెపాసిటీ ఎంత వుంటుంది? అంత ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్స్‌ను తీసుకెళ్లడానికి ఎందుకు అనుమతించినట్టు? జమ్ము కాశ్మీర్ ప్రాంతం అసలే లోయలు, కొండలు, గుట్టల తో కూడి వుంటుంది. పేరుకు జాతీయ రహదారులే కానీ, అత్యంత ప్రమాదకరమైన మూల మలుపులు అడుగడుగునా వుంటాయి. అధికారులు ఇకనైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

 -జయ లక్ష్మి మురళీధర్, మల్కాజ్‌గిరి