4 May, 2026 | 6:37 AM

అంత ధాన్యం ఏమైనట్టు?

01-06-2024 12:05 AM

నిజామాబాద్ జిల్లాలో 37 వేల టన్నులకు పైగా ధాన్యం కనిపించకుండా పోయిన వైనం గురించి ‘వార్త’ చదివి ఆశ్చర్యపో యాం. దాని విలువ సుమారు 72,559 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. ఈ విషయమై ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. విచారించి, బాధ్యులను శిక్షిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ పేర్కొనడం సమంజసంగా ఉంది. ఇంతకూ, అంత మొత్తం ధాన్యం ఏమైనట్టు? ఇటువంటి గోల్‌మాల్స్ జరగడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా దెబ్బతింటుంది. 



 రాజేందర్ ప్రసాద్, కామారెడ్డి