04-12-2025 02:05:22 AM
విచారణకు అనుమతి ఇవ్వాలని డీవోపీటీకి వినతి
అనుమతి రాగానే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఏసీబీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ -రేస్ నిధుల దుర్వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌పై చర్యలు తీసుకునే దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆయన్ను విచారించేందుకు అనుమతి కోరుతూ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ)కు లేఖ రాశారు.
గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు చెల్లించారన్న అభియోగాలు అరవింద్‌కుమార్‌పై ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే, ఆయన అఖిల భారత సర్వీసు అధికారి కావడంతో అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి.
ఈ నేపథ్యంలోనే సీఎస్ కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే సీఎస్ కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే అరవింద్‌కుమార్‌పై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంది. రూ. 55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. తాజా పరిణామంతో ఈ కేసు క్లుమైక్స్‌కు చేరినట్లయింది.