04-12-2025 02:03:49 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం చేసినట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
రికార్డులు స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తియింది. కాగా, నవంబర్ 25న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ విస్తరణకు సంబంధిం చి.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనంపై ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
విలీనమైన వాటిలో పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సిం గి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కోంపల్లి, దుండిగళ్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట, బోడుప్పల్, నిజాంపేట్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం చేసినట్లు ప్రభుత్వం బుధ వారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రికార్డులు స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది.
దీంతో జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తియింది. కాగా, నవంబర్ 25న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ విస్తరణకు సంబంధిం చి.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనంపై ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.