calender_icon.png 1 May, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి పర్యటన జయప్రదం చేయాలి

30-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్29 (విజయక్రాంతి): జాతీయ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా హాజరుకానున్న కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు. మంగళవారం రెబ్బెన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్ సమీపంలో  హెలిపాడ్, సభాస్థలి నీ నేషనల్ హైవే ప్రాజెక్టు అధికారి మణికుమార్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 3500 కోట్ల అంచనాతో మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన 363 జాతీయ రహదారి నీ అధికారికంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజ య్, అదిలాబాద్ ఎంపీ గెడం నగేష్‌తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, ఓ బీసీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయ నాయకులు అశోక్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, శ్యామ్, అరిగేల మల్లికార్జున్, శంకర్, ప్రవీణ్, కృష్ణ, తిరుపతి, సంపత్, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.