calender_icon.png 2 May, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు

30-04-2025 12:00:00 AM

డా.జీ.జానకి షర్మిల ఐపీఎస్, ఎస్పీ నిర్మల్

నిర్మల్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ఇటీవల జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ పై మరియు రోడ్డు ప్రమాదాలపై మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలపై ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది.  ఇందులో  భాగంగానే ఆదివారం మైనర్ డ్రైవింగ్ ల మీద స్పెషల్ డ్రైవ్ చేసి జిల్లాలో సుమారుగా 100 కేసులు బుక్ చేయటం విదితమే. 

ఈ రోజు జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో 91 మైనర్లకు,  107 మంది తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి వేళల్లో హోటళ్లలో, డాబాల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం వాళ్ళ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గ్రహించి, ఇందులో భాగంగానే గతం లో  దాబాలాపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

అదేవిధంగా ఆదివారం మైనర్ డ్రైవింగ్ లపై స్పెషల్ డ్రైవింగ్ చేయటం జరిగింది.  తల్లిదండ్రులకు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్ద అని అందుకే ఇప్పుడు రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు ఇస్తున్నామని మరల ఇలా తప్పు చేస్తే తల్లిదండ్రుల మీ, వాహన యజమానులమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.

అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి మైనర్ పిల్లల తల్లిదండ్రులకు మరియు వాహన యజమానులకు పీపీటీ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఆర్‌ఐలు రాం నిరంజన్ రావు, శేఖర్, రమేష్, రామ కృష్ణ, ఆర్.ఎస్‌ఐ లు, పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు