భూసారాన్ని రక్షించుకుందాం.. లాభసాటి వ్యవసాయం చేద్దాం
- యూరియా వాడకం తగ్గించాలి
- మార్కెటింగ్ శాఖ జేడీ డాక్టర్ పద్మ హర్ష
ఊర్కొండ మే 6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఊర్కొండ మండలంలోని బొమ్మరాసిపల్లె, ఊర్కొండ రైతు వేదికల్లో బుధవారం రైతు వారోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతులకు సాగు మెళకువలు, మార్కెటింగ్ మెళకువలపై అధికారులు, శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేశారు. బొమ్మరాసిపల్లెలో జరిగిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ జేడీ డాక్టర్ పద్మ హర్ష మాట్లాడుతూ రైతులు మితిమీరిన యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు.
మార్కెట్లో ఏ వరి రకానికి అధిక డిమాండ్ ఉందో గమనించి, అటువంటి రకాలను మాత్రమే సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీప్తి, వెటర్నరీ డాక్టర్ రాజేష్, నాగర్కర్నూల్ మార్కెటింగ్ సెక్రటరీ రవికుమార్, ఏఈఓలు ఆంజనేయులు, అరుణమ్మ, బొమ్మరాసిపల్లె, రాంరెడ్డిపల్లె, జగబోయినపల్లి సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు మండల రైతులు పాల్గొన్నారు.






