జీవో పరిధిలో అండగా ఉంటాం
07-05-2026 01:13 AM
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ మే 6 (విజయక్రాంతి): నిబంధనల మేరకు ప్రతి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు అందించినందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఛాంబర్ లో నిర్వహించిన కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు తీసుకుంటున్న నిర్ణయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. చిన్నచిన్న టెక్నికల్ సమస్యలు ఉన్న జీవో పరిధిలో అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ శ్రీనివాస్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు ఉన్నారు.






