26 March, 2026 | 2:51 AM

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

26-03-2026 12:06 AM

గాంధారి, మార్చ్ 25 (విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసినట్టు తహసీల్దార్ రేణుకా చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, వైస్ ఛైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూర్పు రాజులు, లైన్ రమేష్, కామెల్లి బాలరాజు , బొమ్మని బాలయ్య, సంగని బాబా, సర్పంచ్ ల మండల ఫోరం అధ్యక్షులు బీస గణేష్, మదర్, గడ శంకర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.