calender_icon.png 21 December, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును ఢీకొట్టి వ్యాన్ బోల్తా

21-10-2024 12:00:00 AM

ఇద్దరికి గాయాలు.. 9 పశువులు మృతి

నల్లగొండ, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ఆదివారం తెల్లవారుజా మున విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 40 పశువులతో వ్యాన్ వెళ్తున్నది. నార్కెట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ఉన్న వివేరా హోటల్ సమీపంలోకి రాగానే ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొని బోల్తాపడింది. ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు ఆవులు, ఏడు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. వ్యాన్ డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఆర్టీసీ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.