7 March, 2026 | 8:11 PM

అక్రమ ఇసుక రవాణా..!

07-03-2026 06:31 PM

టిప్పర్ ను సీజ్ చేసిన పోలీసులు 

మెదక్,(విజయక్రాంతి): అక్రమ ఇసుక రవాణా మెదక్ జిల్లాలో జోరుగా సాగుతుంది. కొల్చారం మండలం వై జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం రాత్రి మెదక్ నుండి కౌడిపల్లి వైపు ఇసుక లోడుతో వెళ్తున్న ఒక లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.