22 June, 2026 | 3:35 PM

Breaking News

తిప్పారం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం   •   బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •  

స్కూటీని ఢీకొట్టిన వాహనం

17-10-2024 01:49 AM

ఒకరి మృతి, మరొకరికి గాయాలు

రాజేంద్రనగర్, అక్టోబర్16: గుర్తుతెలియని వాహనం.. స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. కార్వాన్ ప్రాంతానికి చెందిన మహేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ అతడి మిత్రుడు నిఖిల్‌తో కలసి సన్ సిటీలో ఉండే తమ మరో స్నేహితుడి వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీపై మంగళవారం రాత్రి బయలుదేరారు.

బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు స్కూటీపై ఇంటికి తిరిగివస్తుండగా టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం వీరి స్కూటీని అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలవడం తో చికిత్స నిమిత్తం నానల్‌నగర్‌లోని ఓలివ్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి.. వాహనాన్ని నిలపకుండా పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.