22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

ఊరెళ్లొచ్చేసరికి ఇల్లుగుల్ల

17-10-2024 01:48 AM

నగదు, నగలు దోచుకెళ్లిన దుండగులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 16: పండుగకు సొంతూరుకి వెళ్లొచ్చేసరికి ఇల్లుగుల్ల అయిన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్‌నగర్ లో కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్న కాంట్రాక్ట్ పనులు చేసే లకావత్ సంపత్ దసరా పండుగను పురస్కరించుకొని ఈనెల 12న తన సొంతూరైన జనగాం జిల్లా రఘురాథపల్లికి కుటుంబ సభ్యులతో  కలిసి వెళ్లాడు.

తిరిగి బుధవారం ఉదయం అంబేద్కర్‌నగర్‌లోని ఇంటికి తిరిగిరాగా.. ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలకి వెళ్లి చూడగా వీరువా తలుపులు తెరిచి ఉండటంతో పాటు అందులోని దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన 2 తులాల బంగారు గొలుసు, రూ.41వేల నగదు చోరీకి గురి అయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.