15 June, 2026 | 7:04 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌ల విజయం అభినందనీయం

29-12-2025 01:37 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ,డిసెంబర్ 28,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలం,అగ్రహారం గ్రామంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో శ్రీ పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తే అభివృద్ధి సాధ్యమని వేములవాడ నియోజకవర్గమే నిదర్శనమన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మీ బిడ్డగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని విప్ ఆది హామీ ఇచ్చారు.