calender_icon.png 19 February, 2026 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల గొంతుక వినిపించాలి!

17-02-2026 12:00:00 AM

కావలి చెన్నయ్య :

బంగ్లాదేశ్‌లో సంవత్సరం కింద వేడెక్కిన రాజకీయ అస్థిరత కు ఎట్టకేలకు తెరపడింది. బంగ్లాదేశ్ పార్లమెంటులోని 299 స్థానాలకు ఎన్నికలు జరగ్గా,  బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) కూ టమి 212 స్థానాలు గెలిచి అధికారాన్ని కైవ సం చేసుకుంది. ఇక జమాతే -ఇస్లామీ కూట మి 77 స్థానాలకు పరిమితమయ్యింది. ‘మతఛాందసవాద శక్తులు వద్దు.. ప్రజాస్వామ్య మే ముద్దు’ అని గ్రహించి ఓటేసిన బంగ్లా ప్రజలు తారీఖ్ రెహమాన్ పార్టీకి పట్టం కట్టారు.

మతఛాందసవాద భావజాలాలున్న జమాతే ఇస్లామి చతికిల పడిపోవ డమేగాక ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అవకతవకలకు పాల్పడిందని కావాలని బీఎన్పీ గెలవడానికి ఫలితాలు ఆలస్యంగా ప్రకటించిందని ఆరోపించింది. ఈ పార్లమెంట్ ఎన్ని కల్లో మహిళా అభ్యర్థుల విషయానికొస్తే బీ ఎన్పీ తరఫున 10 మంది మహిళలు పోటీ చేయగా ఆరుగురు గెలుపొందగా, ఒక మ హిళ స్వతంత్రంగా గెలుపొందగా, మొత్తంగా ఏడుగురు ఎన్నికయ్యారు. ఇక భారత వ్యతిరేక శక్తిగా ముద్రపడిన జమాతే -ఇస్లామీ పా ర్టీ ఒక్క మహిళను కూడా పోటీలో దించకపోవడం ఆ పార్టీ మతఛాందసవాదాన్ని బ హిర్గతం చేసినట్లయింది.

హిందువులపై దాడులు..

ఇక బీఎన్పీ పార్టీ తరఫున దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువుల్లో ఆరుగురు పోటీ చేస్తే అందులో నలుగురు ఎన్నికవ్వడం ఆస క్తి కలిగించింది. జమాతే ఇస్లామీ పార్టీ తరఫున పోటీ చేసిన ఏకైక హిందూ అభ్యర్థి కృ ష్ణ నంది ఓడిపోయారు. బంగ్లాదేశ్‌లో హిం దువుల జనాభా ప్రకారం పార్లమెంటుకు సుమారు 24-30 మంది హిందూ అభ్యర్థులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకో వచ్చు. ప్రతిపాదిత 50 స్థానాలకు గాను 4-5 మంది హిందూ అభ్యర్థులు ఎన్నుకోవడం జరుగుతుంది.

కానీ బంగ్లాలో అలా ఎన్న డూ జరగలేదు. దీన్నిబట్టే బంగ్లాదేశ్‌లో మైనార్టీలు ఎంత దారుణ అణచివేతకు గురవుతున్నారో అర్థమవుతుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆధ్వర్యంలో మొద లై సామాన్య ప్రజలను సైతం  కలుపుకొని చేసిన తిరుగుబాటు ఫలితంగా షేక్ హసీనా ప్రభుత్వ నిష్ర్కమణ, తర్వాత మహమ్మద్ యూనస్ సారథ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో అక్కడి మైనార్టీ హిం దువుల పై జరిగిన దాడులు, హత్యాకాండ, దోపిడీలు, ఇండ్ల దహనం, హిందువులను హత్య చేసి చెట్లకు వేలాడదీసి కాల్చేయడం లాంటివి జరిగాయి.

దీంతో అక్కడి మైనార్టీ లు ఇబ్బందులు పడడమే గాక ఇప్పటికీ భయంతో బతుకుతున్నారు. హిందువులపై జరిగిన దమనకాండను భారత్ సహా ప్రపం చ దేశాలు ఖండించినప్పటికీ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీం తో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి.

అవకాశమెంత?

ఈ తరుణంలో హిందూ మైనార్టీల విషయంలో ఒక అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. బీఎన్పీ నుంచి నలుగురు మైనారిటీలు పార్లమెంట్ కు ఎన్నికవ్వడం సంఖ్య పరంగా చిన్న విషయమే కావొచ్చు. కానీ ఈ నలుగురు మైనార్టీ సభ్యులు తమ వారి హక్కుల కోసం పార్లమెంటులో పోరాడేందుకు చిన్న అవకాశం దొరికినట్లే అని చెప్ప వచ్చు. గెలిచిన నలుగురు హిందువుల్లో గయేశ్వర్ చంద్రరాయ్ (ఢాకా), బీఎన్పీ పార్టీ ఉపాధ్యక్షుడు నితాయ్ రాయ్ చౌదరి (మగుర), దీపెన్ దేవాన్ (రంగమతి), సచింగ్ ప్రు (బందార్ బన్) స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

కానీ అక్కడ ఉన్న మ తఛాందసవాద పార్టీలు, మతోన్మాదము తలకెక్కిన వ్యక్తులు మాత్రం తమ దేశంలో మైనారిటీ హిందువులు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. పథకం ప్రకారమే హిందువులను భయాందోళనకు గురి చేయడము, దైవ దూషణకు పాల్పడుతున్నారం టూ దాడులు, ఆస్తులను కొల్లగొట్టడం, హిం దూ మహిళలపై అత్యాచారాలు, బలవంతం గా మతమార్పిడులు ఇలా లెక్కకు మించి క్రూరమైన కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ అమానవీయ కార్యక్రమాలకు  జమాతే ఇస్లామీ లాంటి మత శక్తుల బలం తోడైంది. 

దేశద్రోహులుగా గుర్తింపు..

1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం ప్రజలంతా ఏకమై పోరాడితే.. జమాతే -ఇస్లామీ మాత్రం విముక్తి పోరాటంలో పాల్గొనకుం డా పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా సహా యం అందించి లక్షల మంది బెంగాలీ చావులకు కారణమైంది. జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన పారా మిలటరీ దళాలు రజాకార్ల సంఘంగా ఏర్పడి బెంగాలీ ప్రజలపై గోరాకృత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఈ రజా కార్లు ఉర్దూ మాట్లాడే వలసదారులుగా భావిస్తారు. అయితే బంగ్లాదేశ్ విముక్తిని వ్యతిరేకించి పాకిస్తాన్ పక్షాన నిలిచిన జమా తే ఇస్లామీ శక్తులను దేశద్రోహులుగా పరిగణిస్తారు.

బంగ్లాదేశ్‌లో రజాకార్లు అనే పదం అత్యంత అవమానకరమైనదిగా, తీవ్రవాద చర్యలతో ముడిపడి ఉంటుంది. స్వాతంత్రం కోరుకున్న బంగ్లాదేశీయులను అణిచివేయడానికి ఆయుధాలు పట్టుకొని మాతృదేశ మానాన్ని దోచుకున్న దొంగలుగా భావిస్తా రు. పాకిస్తాన్‌కు స్థానిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ, ముక్తిబాహిని సైన్యా న్ని, మేధావుల్ని, సాధారణ ప్రజలను అపహరించి, అణిచివేసి, సామూహిక హత్యలు చేసి, అత్యాచారులకు పాల్పడిన తీవ్రవాదులుగా గుర్తింపు పొందారు.

ప్రతీకార చర్య..

1971లో భారత్ మద్దతుతో బంగ్లాదేశ్ స్వాతంత్ర విజయం పొందింది. దీంతో ప్రా ణ భయంతో చాలామంది రజాకార్లు పాకిస్తాన్ పారిపోగా మిగిలిన వారిలో కొంత మందిపై ముక్తిబాహిని సైన్యం ప్రతీకార చర్యలు తీసుకుంది. ఆ తర్వాత జమాతే ఇస్లామీపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం పడింది. అయితే 2024లో హసీనా ప్రభు త్వం ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు కేటాయించి అందులో 30 శాతం బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలకు కేటాయించడం జరిగింది. 

దీంతో ఉద్యో గ కోటా వ్యతిరేక నిరసనల అల్లర్లలో పాల్గొన్న వారిని ప్రధాని షేక్ హసీనా.. రజాకార్ల పిల్లలతో పోల్చడంతో బంగ్లాదేశ్ భగ్గున మండింది. అంతేకాదు 2010లో షేక్ హసీ నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నేర ట్రిబునల్ 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర విముక్తి పోరాటంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పనిచేసిన రజాకార్లు 10,789 మందిగా గుర్తించి భవిష్యత్ బంగ్లాదేశ్ తరాల వారికి తెలవడం కోసం 2019 డిసెంబర్‌లో చాలామందికి జైలుశిక్షలు వేసింది. అయితే వీరంతా జమాతే ఇస్లామీ పార్టీకి చెందినవారే.

జమాతే వంటి సంస్థలతో బంగ్లాదేశ్‌కు మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది. చివరగా బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్‌కు ఎన్నికైన నలుగురు మైనార్టీ ఎంపీలు తమ వారి తరఫున చట్టసభలో గట్టి వాదనలు వినిపించి అక్కడి అల్పసంఖ్యాక వర్గాల ప్రజల గొంతుకగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 వ్యాసకర్త సెల్: 9000481768