24 June, 2026 | 2:14 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిది

19-11-2025 12:00 AM

ఖైరతాబాద్: నవంబర్ 18 (విజయ క్రాం తి): భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్య లో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బరడ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.

హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ వి. ఎ.మంగను అభినందించారు. ఇటీవల కాలం లో భాగ్యనగరంలో బర్డ్ వాచింగ్ అభిరుచి ఉధ్రుతంగా పెరిగిందన్నారు. సభాధ్యక్షత వ హించిన కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మ హ్మద్ రఫీ మాట్లాడుతూ సరళమైన తెలుగు భాషలో అందమైన అరుదైన పక్షుల విశేషాలతో పుస్తకం ఆసక్తికరంగా రచయిత్రి మంగ తీసుకొచ్చారని అభినందించారు.

డాక్టర్ వి. ఎ. మంగ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తరువాత సరదాగా తీసిన ఫోటోగ్రఫీకి చిక్కిన తేనె పిట్ట తనలో పక్షులపై విపరీతమైన ఆసక్తిని పెంచి అభిరుచిగా మార్చినట్లు తెలిపారు. సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షిస్తూ పక్షులతో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను వివరించారు. జయహో పబ్లికేషన్స్ పి.వై.బాబు సమన్వయం చేశారు.