calender_icon.png 19 November, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం

19-11-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి

మానకొండూరు, నవంబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇతర హామీలను పూర్తిగా విస్మరించిందని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, విమర్శించారు. హామీలను నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని‘ ఆయన డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా చేయూత పథకం కింద వయోవృద్ధులకు ప్రకటించిన నెలకు రూ. 4000 పెన్షన్ను ఇవ్వకపోవడంతో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారిందని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయలేదని తెలిపారు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందించడం లేదని, యువ వికాస పథకం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ. 5 లక్షల విద్య భరోసా కార్డును ఇవ్వలేదని అన్నారు.

వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం హామీని అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి సైతం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదగిరి ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల పోరులోకి రావాలని యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆటో అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అసంఘటిత కార్మికులందరికీ రూపాయలు 5లక్షల బీమా చేయించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించ కుండా బీమా ను రద్దు చేశారని మండి పడ్డారు ఆటో డ్రైవర్లకు నెలకు రూపాయలు వెయ్యి చొప్పున ఏడాదికి రూపాయలు12000 చొప్పున రెండు సంవత్సరాలకు 24 వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.