22 May, 2026 | 2:04 AM

కాంటాలైన ధాన్యాన్ని మిల్లులకు పంపాలి

22-05-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 21: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని తహసీల్దార్ బి శ్రీకాంత్ నిర్వాహకులకు సూచించారు. మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు విధానం, తూకం ప్రక్రియ, తేమశాతం పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను వేగంగా జరపాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సరళ, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.