19 August, 2026 | 8:39 PM

Breaking News

కొండగట్టు దేవస్థానంలో రెండు రోజులు దర్శనాలు రద్దు   •   సామాజిక సమస్యల పరిష్కారానికి... కాలనీవాసుల సహకారం ఎంతో అవసరం   •   ఇస్మాయిల్ ఖాన్ గూడ స్మశాన వాటిక వివాదం   •   ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందే సమగ్ర నిల్వ ప్రణాళిక సిద్ధం చేయాలి   •   అమ్మ ప్రేమలాంటి అంగన్వాడీలో ఆరోగ్యం   •   ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. ప్రయాణికుడి సెల్‌ఫోన్ అప్పగింత   •   ప్రభుత్వాలు దళిత సమస్యలను విస్మరించాయి   •   రెండవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు   •   జిల్లా ఎస్పీ నర్సింహకు రాఖీలు కట్టిన కిట్స్ కళాశాల విద్యార్థినులు   •   గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్   •  

నేతన్నల సంక్షేమమే ధ్యేయం

05-12-2024 12:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4(విజయక్రాంతి): నేతన్నల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం భవన్‌లో చేనేత శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను ఆమె ప్రారంభించి మాట్లాడారు.

టెస్కోకు రావాల్సిన రూ.488.38 కోట్ల నిధుల్లో ఇప్పటికే సర్కార్ రూ.465 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను (టీజీఎస్‌సీవో)టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలకు జీవో జారీ చేశామన్నారు. నూలు డిపోను నడిపేందుకు రూ.50 కోట్లతో కార్పస్ ఫండ్‌ను మంజూరు చేశామన్నారు. ఫండ్ సిరిసిలకు నేతన్నలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.

నేతన్నకు చేయూత పథకం ద్వారా 36,333 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు రూ.290 కోట్లు విడుదల చేసి లబ్ధి చేకూర్చామన్నారు. కార్యక్రమంలో హడ్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వరరావు, ఇందుమతిదేవి, హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఓఎస్‌డీ బాషా, టెస్కో జీఎం అశోక్‌రావు పాల్గొన్నారు.