13 June, 2026 | 12:50 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

13-06-2026 12:20 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్ 12 (విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. కల్వకుర్తి మండలం, మున్సిపా లిటీ పరిధిలోని మొత్తం 126 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో, ఆర్డీవో జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షాన్వాస్ ఖాన్, ఎమ్మార్వో ఇబ్రహీం, నాయకులు ఆనంద్‌కుమార్, అశోక్‌రెడ్డి, విజయ కుమార్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.