calender_icon.png 9 January, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎంశ్రీ ఫుట్‌బాల్ కప్ విజేత రాజాపూర్

08-01-2026 01:29:24 AM

రాజాపూర్ జనవరి 7: పిఎం శ్రీ  పథకంలో భాగంగా జిల్లా స్థాయి బాలుర విభాగంలో పుట్ బాల్ క్రీడా పోటీలో రాజాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచినట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహించిన ఆటల పోటీలలో 24 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

పిఎం శ్రీ క్రీడా పోటీలలో రాజాపూర్ విద్యార్థులు బాలుర విభాగంలో  ఫుట్ బాల్ ఫైనల్ చేరుకొని జట్టు సభ్యులు చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ సమన్వయము తో ఆడి ఫుట్ బాల్ కప్ ను కైవసం చేసుకున్నారు. కప్ గెలిచినా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం ఫిజికల్ డైరెక్టర్ వెంకటమ్మ,స్పోరట్స్ కోచ్ ప్రకాష్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.