calender_icon.png 20 May, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

20-05-2025 06:15:35 PM

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పట్టణంలోని మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పన్నులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలోని బిటిఎస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువ, వంతెన నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.