calender_icon.png 20 May, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు పోలీసుల ‘భరోసా’

20-05-2025 06:10:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): బాధితులకు అండగా నిలిచేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘భరోసా' కేంద్రం మూడేళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudheer Ramnath Kekan) హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... బాధితులు భరోసా సెంటర్ కి రాగానే వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, అత్యవసర పరిస్థితులలో ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.

మూడవ వార్షికోత్సవం సందర్భంగా భరోసా తరుపున నలుగురు బాధితులకు తక్షణ సహాయం కింద 30 వేల రూపాయలు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. మూడు సంవత్సరాలుగా భరోసా సెంటర్ కు వచ్చే బాధితులకు భరోసా కేంద్రం ఎస్ఐ, సిబ్బందిని చేస్తున్న కృషిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, సీఐలు చంద్రమౌళి, దేవేందర్, సర్వయ్య, రూరల్ ఎస్ఐ దీపిక, భరోసా సెంటర్ ఎస్ఐ ఝాన్సీ, షీ టీం ఎస్ఐ సునంద, డిడబ్ల్యూఓ ధనమ్మ, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి, భరోసా సిబ్బంది జ్యోష్ణ, సాహిత్య, జయశ్రీ, బేబీ, పార్వతి, రేణుక, మౌనిక, సఖి, షీ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.