calender_icon.png 21 May, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు

20-05-2025 06:24:32 PM

45 మంది రక్తదానం..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, గూడూర్, నెల్లికుదురు, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆయా వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు తినిపించారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొని శంకర్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని ఐఎంఏ హల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 45 మంది రక్త దానం చేశారు. అలాగే కురవి వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వివిధ మండల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.