17 August, 2026 | 8:07 PM

కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

17-08-2026 07:02 PM

కోనరావుపేట ఆగష్టు 17 (విజయక్రాంతి): కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సంబంధిత కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేసి అందించాలని కోరారు.ప్రభుత్వం, సంబంధిత యాజమాన్యాలు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తున్నా అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సునీల్, లావణ్య, భాస్కర్, లత, శివ, లక్ష్మణ్, శోభారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.