calender_icon.png 6 August, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమృత్ స్కీం కింద మంజూరైన పనులు పూర్తి చేయాలి

06-08-2025 06:48:33 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని ఏఆర్ నగర్ కాలనీ, మషంపల్లి రోడ్డు, శాంతినగర్ శివారు ప్రాంతంలో అమృత్ స్కీమ్ పథకం కింద మంజూరైన అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలు, సిసి రోడ్లు, మంచినీటి పైప్లైన్లు నిర్మాణం వెంటనే  పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. దాదాపు 40-50 సంవత్సరాలు పేద వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలలో యుజిడి ప్రతిపాదనలు పంపకపోవడం, ప్రజాపతినిధుల, అధికారుల బాధ్యతరాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

వీరి మూలంగా ఆ ప్రాంత పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో మున్సిపల్ కార్యాలయాని ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూకల వెంకట నారాయణ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు గడ్డం మహేష్, బిజెపి నాయకులు గుండగోని శ్రీనివాస్, గాలి దేవేందర్, ఎన్నమల్ల మహేష్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, సాయి లొడిత సాయికుమార్, పొనుగోటి దామురావ్ కటకం మహేష్ తదితరులు పాల్గొన్నారు.