calender_icon.png 6 August, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరాలకు దీటుగా

06-08-2025 06:43:08 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో సినీ వీధి ఏర్పాటయింది. చిన్న చిన్న ఫంక్షన్లకు ఉపయోగించే ఈ మినీ థియేటర్ను సిరిసిల్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ(Circle Inspector Krishna) చేతుల మీదుగా ప్రారంభించారు.హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ లాంటి మహానగరాలకు దీటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సినీ వీధి ఏర్పాటు చేశారు. సినిమా థియేటర్లు సినిమా చూస్తూ ఉన్న ఫీలింగ్స్ ఈ మినీ థియేటర్లో కూడా ఉంటుంది. చిన్న చిన్న శుభ కార్యక్రమాలు సినిమాలు చూస్తూ నిర్వహించుకోవచ్చు. డాల్బీన్ సౌండ్ తో మినీ థియేటర్ మెయిన్ థియేటర్ ను తలపిస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ వీధి నిర్వాహకులు మెరుగు సుమన్, చిలుక రాజకుమార్, ఎస్ ఎస్ కేబుల్ మేనేజర్ ప్రశాంత్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్, నల్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.